Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Drugs | రూ.4.5 కోట్ల డ్రగ్స్ నిర్వీర్యం

Drugs | రూ.4.5 కోట్ల డ్రగ్స్ నిర్వీర్యం

క్రైమ్ విభాగం డీసీపీ ఎన్‌.శ్వేత వెల్లడి

రూ.4.56 కోట్ల విలువైన వివిధ మత్తుపదార్థాలను గురువారం నిర్వీర్యం చేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్‌(Drugs Disposal) కమిటీ అధ్యక్షురాలు ఎన్‌.శ్వేత తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతంలోని ఓ కంపెనీలో వీటిని దగ్ధం చేశారు. డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌(Detective Department), నగర పోలీస్‌ కమిషనర్‌ (City Police Commissioner) వి.సి.సజ్జనార్‌ (Sajjanar) పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇవి వివిధ కేసుల్లో పట్టుబడ్డాయని చెప్పారు. డ్రగ్స్ నిర్వీర్యానికి సంబంధించి ఇవాళ మొదటి దశ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో.. కోకైన్‌, గంజాయి, హష్‌ఆయీల్‌, ఏమ్‌డీఎమ్‌, నేట్రావిట్‌ మాత్రలు, ఎల్‌ఎన్‌డి, బ్లాట్స్‌, ఓబిసి పేపర్‌ తదితర మత్తు పదార్థాలు ఉన్నాయి. వీటి మార్కెట్‌ విలువ రూ.4,56,43,930 ఉంటుందని వెల్లడించారు. 2019వ సంవత్సరం నుంచి 2025 వరకు 128 ఎన్‌బిపీఎస్‌ (Nbps) కేసులు హైదరాబాద్‌ నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News