ఈరోజు కొత్తపేట డివిజన్ పరిధిలోని ప్రజయ్ నివాస్ ఫేజ్–1, ఫేజ్–2 మరియు మానస ఎన్‌క్లేవ్ కాలనీలలో డ్రైనేజ్ పనులను కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ పనులకు సుమారు 8 లక్షల రూపాయల వ్యయం కేటాయించబడింది. ప్రస్తుతం ఉన్న 200 మి.మీ. డయా పైప్‌లైన్‌ను 300 మి.మీ. డయా పైప్‌లైన్‌గా మార్చి, ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఎదురవుతున్న డ్రైనేజ్ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఈ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ!!
“చాలాకాలంగా ప్రజయ్ నివాస్ ఫేస్-1, ఫేస్ 2, మానస ఎన్‌క్లేవ్ ప్రజలు డ్రైనేజ్ సమస్యతో నిరంతరం ఇబ్బంది పడేవారు. పైప్లైన్ చిన్నది కావడంతో ఈ యొక్క సమస్య తరచూ వస్తూ ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ పనులు మొదలుపెట్టడం జరిగింది. పనులలో ఏలాంటి జాప్యం లేకుండా, లెవెల్స్ సరి చూసుకుంటూ,నాణ్యతతో కూడిన పనులు జరగాలని కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు ఏఈ స్రవంతి రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్, సూపర్వైజర్ దయాకర్ మరియు ప్రజయ్ నివాస్ ఫేస్ – 1, ఫేస్ – 2 అసోసియేషన్ సభ్యులు, కొత్తపేట డివిజన్ బిజెపి అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్, జిల్లా నాయకులు జంగా రెడ్డి, అశ్విన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


