Friday, January 16, 2026
EPAPER
Homeఆరోగ్యంMilk | ఇబ్బందుల‘పాలు’

Milk | ఇబ్బందుల‘పాలు’

కొంత మందికి పాలు తాగటం ఇష్టం ఉండదు. కొంత మందికి పాలు తాగితే పడవు. దానివల్ల ఇబ్బందులపాలు(Problems) అవుతారు. విరేచనాలు(Diarrhea), వికారం, వాంతులు(Vomiting), కడుపు నొప్పి(Abdominal Pain), కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్(Gas Trouble) వంటివి తలెత్తుతాయి. దీనికి కారణం.. లాక్టేజ్ అనే ఎంజైమ్ లేకపోవటమే. ఇది సహజంగా చిన్న పేగుల నుంచి పుడుతుంది. పాలలోని లాక్టోజ్ అనే చక్కెరను గ్లూకోజ్, గ్యాలక్టోజ్ అనే చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా పాలు జీర్ణమవుతాయి. తర్వాత పేగుల గోడల ద్వారా రక్తంలో కలుస్తాయి. లాక్టేజ్ ఉత్పత్తి ఐదేళ్ల వయసు తర్వాత తగ్గుతుంది. కొంత మందిలో జన్యుపరంగా ఈ ఎంజైమ్ మోతాదు భారీగా పడిపోతుంది. ఇలా జరిగినప్పుడు పాలు తాగినా అరగవు. అప్పుడు లాక్టోజ్ డైరెక్టుగా పెద్దపేగులోకి వెళ్లి బ్యాక్టీరియాతో రియాక్షన్ జరిపితే పైన పేర్కొన్న సమస్యలు వస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News