- స్వయంభు పంచ నారసింహ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
- ఆలయ సమయ వేళలలో మార్పులు
- వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ ఈవో వెంకట్రావు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ నుండి వచ్చేనెల 14 వ తేదీ వరకు ఒక నెల రోజులపాటు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 4:30 నుండి 5:00 గంటల వరకు ఆలయ ముఖ మండపం పైన ఉత్తర భాగం హాలు నందు అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తారు.ఉత్సవాలలో భాగంగా జనవరి 14 వ తేదీ రాత్రి 7:00 గంటలకు గోదా కళ్యాణం, 15 వ తేదీ ఉదయం 11:30 నిమిషాలకు ఓడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తారు.

ధనుర్మాస ఉత్సవాలలో ప్రధాన ఆలయంలో నిత్యం నిర్వహింపబడు కైంకర్యాల ఆలయ సమయ వేళలో కూడా మార్పు చేశారు.ఉదయం 3:30 నిమిషాలకు సుప్రభాతం, 4:00 నుండి 4:30 వరకు తిరువారాధన, 4:30 నుండి 5:00 గంటల వరకు తిరుప్పావై సేవా కాలం, 5:00 గంటల నుండి 6:00 గంటల వరకు నివేదన చాత్మర,6:00 గంటల నుండి 7:00 గంటల వరకు నిజాబిభిషేకం,7:00 గంటల నుండి 7:45 వరకు సహస్రనామార్చన, 7:45 తర్వాత ధర్మ దర్శనములు ప్రారంభమవుతాయి, అలాగే నిత్య కైంకర్యములు యధావిధిగా నిర్వహింపబడతాయి.


