Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంLand Mafia | భూమాఫియా చేతుల్లో బలైన సామాన్యుడు

Land Mafia | భూమాఫియా చేతుల్లో బలైన సామాన్యుడు

జహీరాబాద్ పాత మునిపల్ కమిషనర్‌పై క్రిమినల్ కేసు

భూమాఫియాతో చేతులు కలిపినందుకు చర్యలు

- Advertisement -

కోర్టు ఆదేశాలతో మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపైన కూడా క్రిమినల్ కేసులు

ఒక సబ్ రిజిస్ట్రార్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు

పటోళ్ల నరసింహా రెడ్డి, వేణుగోపాల్ సర్దా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

మాఫియా కింగ్ పిన్ (Mafia King Pin) పటోళ్ల నరసింహా రెడ్డి, అతని ప్రధాన అనుచరుడు, స్థానిక గూండా వేణుగోపాల్ సర్దా.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) కేంద్రంగా ఖరీదైన భూములను అక్రమ పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. వాళ్లిద్దరితో చేతులు కలిపిన జహీరాబాద్ పాత మునిసిపల్ కమిషనర్ (Municipal Commissioner), ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల(SubRegistrars)పై కూడా కోర్టు ఆదేశాలతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉంటూ పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ నైస్‌గా నమ్మించి మోసం చేసే పటోళ్ల నరసింహా రెడ్డి (Patolla Narasimha Reddy) క్రిమినల్ (Criminal) అని వెలుగులోకి వచ్చింది.

పెద్ద పెద్దవాళ్ల ఫంక్షన్లకు వెళ్లి పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడటంలో నరసింహ రెడ్డి దిట్ట. ఇప్పటికే భూములు ఉన్న వాళ్లైతే వాళ్ల వద్దకు వెళ్లి తాను డెవలప్ చేసి ప్లాట్లుగా మార్చి ఇస్తానని చెప్పి పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మబలికి ట్రాప్ చేయడం, తర్వాత వాటిని మునిసిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమ పద్ధతిలో తమ పేర్లపైకి మార్చుకొని మోసాలు చేయడంలో పటోళ్ల నరసింహా రెడ్డి ఆరితేరిపోయాడు.

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్(SRO) పరిధిలో పదుల సంఖ్యలో భూఆక్రమణలు, మోసాలు చేస్తూ బాధితులను, నిజమైన భూయజమానులను అక్కడ అడుగు పెడితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నరసింహా రెడ్డి ప్లాన్ చేస్తే దాన్ని అమలుపరిచేదంతా జహీరాబాద్‌కు చెందిన వేణుగోపాల్ సర్దా. అతని అనుచరులు, బంధువులపై స్థానికంగా అనేక కేసులు, ఆరోపణలు ఉన్నాయి. నేరుగా భూయజమనుల దగ్గరికి వెళ్లి చంపుతానంటూ బెదిరించడం, పోలీసులతో తప్పుడు కేసులు, గంజాయి కేసులు పెట్టిస్తానంటూ బెదరగొట్టడంలో వేణుగోపాల్ బాగా ముదిరిపోయాడు.

తమ మాట వినకపోయినా, తాము అనుకున్నవాళ్ల పేర్లపై భూములు మార్చకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని కూడా బెదిరిస్తారనేది స్థానికంగా అందరికీ తెలిసిన విషయమే. వీళ్ల దాడులకు, దౌర్జన్యాలకు భయపడి ఎంతో మంది భూయజమానులు తమ భూములను వదులుకోవాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో తనకు రాజకీయ పలుకుబడి ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ పటోళ్ల నరసింహా రెడ్డి అనేక మంది బాధితులను బెదిరించినట్లు తెలిసింది.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వినోబా గౌడ్ కూడా వీళ్ల చేతిలో మోసపోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం, టౌన్, మునిసిపాలిటీలో వినోబా గౌడ్‌కు చెందిన సర్వే నంబర్ 343 పార్ట్‌లోని 13 ఎకరాల ఖరీదైన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా మారుస్తామంటూ మభ్యపెట్టిన పటోళ్ల నరసింహా రెడ్డి, వేణుగోపాల్ సర్దా.. 2018లో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మొత్తంగా ముంచేశారు. డీటీసీపీ లే ఔట్ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు కల్పించకుండా మునిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్ సహకారంతో ఎడాపెడా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, జీపీఏలు చేసి కొంత భూమిని కొల్లగొట్టారు. 8 వేల గజాలకు జీపీఏలను సృష్టించి, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు.

ఈ అన్యాయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వినోబా గౌడ్ వెళ్లగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో అతను కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు కొంత విజయం సాధించాడు. వినోబా గౌడ్ పిటిషన్‌ను విచారించిన జహీరాబాద్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పటోళ్ల నరసింహా రెడ్డి, అతని ప్రధాన అనుచరుడు వేణుగోపాల్ సర్దా, అక్రమాలకు సహకరించిన అధికారులు మాసాని ఉమా మహేశ్వర్ రావు(అప్పటి జహీరాబాద్ మునిసిపల్ కమిషనర్), అప్పటి జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ అబ్దుల్ హఫీజ్(సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్), పరన్ జ్యోతి(జహీరాబాద్ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్), ఎన్.వెంకట్ రామ్ రెడ్డి, పట్లోళ్ల రాజిరెడ్డి, బసంత్‌పూర్ నందకిషోర్, పి.సారయ్యపై కోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 20-12-2025న ఎఫ్ఐఆర్ నంబర్ 461/2025ను నమోదు చేయటం జరిగింది. ఇందులో యాక్ట్స్ అండ్ సెక్షన్స్ 61, 316, 336(1), 338, r/w 3(5) BNS, 175(3) BNSSను చేర్చారు. ఈ కేసును ఎస్ఐ కొరిపెల్లి వినయ్ కుమార్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

అప్పటి జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ అబ్దుల్ హఫీజ్‌ను అధికారులు సస్పెండ్ చేసినప్పటికీ.. ఆ భయం ఏమాత్రం లేకుండా.. జహీరాబాద్ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ పరన్ జ్యోతి ఇష్టారాజ్యంగా వ్యవహరించి జీపీఏలను సృష్టించారు. నిందితులతో చేతులు కలిపి అడ్డదారిలో ప్లాట్లు విక్రయించేందుకు సహకరించారు. అక్రమార్కులైన భూమాఫియాలోతో చేతులు కలిపి కోట్లు సంపాదించారు. అనేక మంది యజమానుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడం, అసలు కనిపించని, లేని భూమిని కూడా ఉన్నట్లుగా చిత్రీకరించి రిజిస్ట్రేషన్లు చేయడం వంటి అడ్డగోలు పనులకు పాల్పడ్డారు. హఫీజ్ చేతిలో మోసపోయిన ఎంతో మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో అతణ్ని అధికారులు సస్పెండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News