గణపురం మండలం అల్లమాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 8 కి 8 వార్డు మెంబర్లను కైవాసం చేశారు. గురువారం మొదటి విడత జరిగిన సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కే పద్మమ్మ 364 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ మండల ఇన్చార్జిలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ, ఎస్ కే షఫీ గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -
