20-30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్(Naveen Yadav)కు సొంత ఓటు బ్యాంకు
అంగబలం, అర్థబలం, ప్రజల మద్దతు అన్నీ నవీన్ వైపే
నియోజకవర్గంలోని మైనార్టీలందరూ నవీన్‌కే మద్దతు
ఏళ్ల తరబడి జూబ్లీహిల్స్ వాసులతో ఎనలేని అనుబంధం
ఫలించబోతున్న “ఆదాబ్ హైదరాబాద్” జోస్యం
జూబ్లీహిల్స్‌లో “రేవంత్ కోసం.. మార్పు కోసం” అనే నినాదాలు గల్లీగల్లీలో మార్మోగుతున్నాయి. ఇది సాధారణ ప్రచారం కాదు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం మరోసారి మొదలైన ప్రజా ఉద్యమం. రేవంత్ రెడ్డి నేతృత్వం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త స్ఫూర్తికి ప్రతీక.
గెలుపు బాధ్యత స్వయంగా తన భుజాలపై వేసుకొని రంగంలోకి నేనే దిగుతున్నా అంటూ పార్టీ క్యాడర్‌లో ఎనలేని ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)కి జూబ్లీహిల్స్ ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో ఆయన అడుగులు ఉత్సాహాన్ని ఇస్తూ కేవలం రాజకీయ రణరంగంలోనే కాదు.. ప్రజల హృదయాల్లోనూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.. ప్రతి సభలో ఆయన మాటల దూకుడు నాయకత్వానికి సరికొత్త నిర్వచనంగా, ప్రజల మనసు గెలిస్తే ఏ సీటూ మనకి దూరం కాదు.. అనే నమ్మకంతో ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతున్నారు.
బస్తీల్లో తిరిగి, ప్రజల చేతుల్లో చెయ్యి వేసి, వారి సమస్యలు విన్న తీరు, రేవంత్ రెడ్డి శైలి అబ్బురపరుస్తోంది. నాయకుడుగా కాకుండా సేవకుడిగా కనిపించాలన్న లక్ష్యం ఆయన అడుగెట్టిన ప్రతి ప్రచారంలో ప్రతిధ్వనిస్తోంది. పార్టీ నేతలకే కాక ప్రజలకూ నూతన ఉత్సాహం నింపిన రేవంత్ అడుగులు గెలుపు నినాదంతో ముందుకు సాగుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election) ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్(Hot Topic)గా మారింది. ఈ ఎన్నిక కేవలం ఓ స్థానిక పోటీ కాదు. తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే కీలక మలుపుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో ముందుండటంతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో మరింత ఉత్సాహం ఊపందుకుంది. ప్రజలతో మమేకమవ్వాలన్న ధ్యేయంతో రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్ బస్తీల నుంచి బంజారాహిల్స్ వరకూ, యూసుఫ్‌గూడ నుంచి షేక్‌పేట్ వరకూ కాంగ్రెస్ జెండాలు ఎగురుతున్నాయి. “నవీన్ అన్న వచ్చాడు” అనే నినాదం ప్రతి గల్లీలో వినిపిస్తోంది.
బస్తీల్లో సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రజల సమస్యలకు అండగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై స్థానికుల్లో విశేష విశ్వాసం నెలకొంది. ఏళ్ల తరబడి బస్తీల్లో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించిన అనుభవం ఆయనకు ఇప్పుడు ఓటు రూపంలో తిరిగి వస్తోంది. మైనారిటీల్లో కనీసం 60% ఓట్లు ఆయన వెనక ఉన్నాయనే విశ్వాసం కాంగ్రెస్ శిబిరంలో ఉంది. ఈ యువనాయకుడి పట్ల ఉన్న ప్రజాభిమానమే కాదు.. ఆయన ఏళ్ల తరబడి బస్తి ప్రజలతో కలసికట్టుగా పనిచేసిన అనుబంధం కూడా ఓటర్లలో విశ్వాసాన్ని కలిగిస్తోంది.
కాంగ్రెస్ నుంచి జరిలో దిగిన సవీన్ యాదవ్ సొంత ఓటు బ్యాంక్ బలంగా ఉండడం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్(Plus Point)గా మారింది. అదనంగా అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఏకమై ప్రచారంలో పాల్గొనడం వల్ల మరో 30 శాతం ఓటు వాటా కూడా సహజంగానే కాంగ్రెస్ వైపు చేరుతుందని అంచనా.
