Homeమహబూబ్‌నగర్‌Campaign | మీ శ్రేయోభిలాషిగా వస్తున్న..ఆదరించి ఆశీర్వదించండి

Campaign | మీ శ్రేయోభిలాషిగా వస్తున్న..ఆదరించి ఆశీర్వదించండి

  • 18వ వార్డు లో కాంగ్రెస్ ప్రచారానికి అపూర్వ స్పందన.
  • ఆదరించి గెలిపిస్తే..వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా…
  • ప్రచారంలో ముందంజలో జయానందం

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మున్సిపాలిటీలోని 18 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పిడి జయనందం ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చింది. వార్డులల్లో నెలకొన్న సమస్యలపై క్షుణంగా ప్రజల అభిప్రాయాలతో తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు.

Congress Ward 18 Campaign Led by Jayanandam1

రేవంత్ రెడ్డి సర్కార్ లో సబండ వర్గాలకు మేలు జరుగుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సహకారంతో 18 వ వార్డును రెట్టింపు అభివృద్ధి చేస్తానని తెలిపారు. వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేయడానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
Congress Ward 18 Campaign Led by Jayanandam2

ప్రజలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కంకణం కట్టుకొని జననిరాజనం పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిడి జయనందం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కళానందం బాబు, విశ్వం బాబు, గందం లక్ష్మయ్య, బషీర్, చెన్నయ్య, రాహుల్ రాయ్, మేకల చెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News