ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం(World Foodball legend) లియోనెల్ మెస్సీ(Lionel Messi)తో ఫ్రెండ్లీ ఫైట్(Friendly Fight)లో తలపడిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు (Social Welfare Hostels Students) తెలంగాణకు గర్వకారణమని (Telangana Pride) సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు అని అభివర్ణించారు. అవకాశం కల్పిస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైడ్‌కు ప్రతీకలుగా నిలిచిన ఈ యువ సోదరులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పే స్థాయికి మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -
