HomeరాజకీయంCongress | పార్టీ పెద్దలకు నవీన్ యాదవ్‌ను పరిచయం చేసిన సీఎం

Congress | పార్టీ పెద్దలకు నవీన్ యాదవ్‌ను పరిచయం చేసిన సీఎం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్‌(Naveen Yadav)ను రాహుల్ గాంధీకి పరిచయం చేశారు.

WhatsApp Image 2025 11 15 at 21.26.18

సీఎంతోపాటు రాహుల్ గాంధీని కలిసినవారిలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal), ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
WhatsApp Image 2025 11 15 at 21.26.17

రేవంత్, మీనాక్షీ నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, నవీన్ యాదవ్, రోహిన్ రెడ్డి తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)ని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News