- సిఐటియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు..
సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5 వ, మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి ఆర్ ఎన్ రమేష్, మండ్ల రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ.. డిసెంబర్ 7, 8,9 తేదీలలో మెదక్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందనీ, బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిఐటియు ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి బివి రాఘవులు, సిఐటియు అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ హేమలత, అఖిలభారత కోశాధికారి సాయిబాబు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.
బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా విభజించి కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ కార్మిక హక్కులను కాల రాస్తుందని పేర్కొన్నారు. 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేసి లేబర్ 4 కోడ్ లు రద్దు చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
