Wednesday, February 11, 2026
HomeసినిమాGlobal Summit | సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

Global Summit | సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి(Cine Industry Development)కి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో స్టూడియోలను ఏర్పాటుచేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 రెండో రోజున “సృజనాత్మక శతాబ్దం–వినోద రంగం భవిష్యత్తు” అనే అంశంపై జరిగిన చర్చల్లో చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సందర్బంగా సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
  • ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోపాటు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు.
  • ప్రముఖ నటుడు చిరంజీవి(Chiranjeevi)తోపాటు రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, జెనీలియా దేశ్‌ముఖ్, అక్కినేని అమల(Akkineni Amala), అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండే, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు.
  • స్క్రిప్టుతో వస్తే సినిమా పూర్తి చేసుకొని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని సీఎం చెప్పారు.
  • ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News