Saturday, April 18, 2026
HomeసినిమాSwayambhu| మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'రా రా ధీవర' రిలీజ్

Swayambhu| మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ రిలీజ్

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ అంచనాలను భారీగా పెంచింది.

రవి బస్రూర్ సంగీతం అందించడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆయన ఆ అంచనాలను మించి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. పవర్ ఫుల్ డ్రమ్స్, ఆర్కెస్ట్రా లేయర్స్‌తో పాట ఒక యోధుడి నినాదంలా అనిపిస్తుంది. సంతోష్ వెంకీ వోకల్స్ పవర్‌ను మరింత పెంచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ధైర్యం, సంకల్పం, యోధుని ఆత్మను ప్రతిబింబిస్తాయి.

- Advertisement -

ఈ పాటలో నిఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్ లుక్, యుద్ధానికి సిద్ధమైన బాడీ లాంగ్వేజ్, ఖడ్గాలతో చేసే యాక్షన్ ఫైట్స్.. కఠిన సాధనను చూపిస్తున్నాయి. ఆయన చేసిన ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. హై ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటారు. నభా నటేశ్ ఈ పాటలో కనిపిస్తూ విజువల్ మరింత ఆకర్షణ తెచ్చారు.

సినిమా గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కేకే సెంథిల్ కుమార్ అద్భుతమైన విజువల్స్‌తో భారీ సెట్లు, యుద్ధభూములు, యోధుల గుంపులను అద్భుతంగా చూపించారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్‌ను భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు, స్టేజింగ్,యు స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ అన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. విజే బిన్నీ మాస్టర్ కొరియోగ్రఫీ వార్ డ్యాన్స్ రిథమ్‌తో కలిపి ‘రా రా ధీవర’ను ఒక గొప్ప వేడుకగా నిలుస్తోంది.

ప్రొడక్షన్ డిజైనర్స్ ఎం. ప్రభాహరణ్, రవీంద్ర రూపొందించిన సెట్స్, పీరియడ్ డిటైలింగ్ సినిమాకు మరింత వైభవాన్ని తీసుకువచ్చాయి. ప్రతి అంశం కలిపి ఒక భారీ ప్రపంచాన్ని సృష్టించాయి.

ఈ మ్యూజికల్ లాంచ్‌తో ‘స్వయంభూ’ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఇప్పుడు ఈ పాటతో మరింత హైప్ క్రియేట్ చేసింది.

‘స్వయంభూ’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
DOP: KK సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -
RELATED ARTICLES

Latest News