- విద్యార్థులకు సీఐ దూది రాజు హితబోధ
విద్యార్థులు చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ దూది రాజు హితవు పలికారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఎస్ఐ బి.రాంబాబు ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల విక్రయం, సేవనం తీవ్రమైన నేరాలని, వీటిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచారని హెచ్చరించారు. పట్టుబడితే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. విద్యార్థులు చదువుపైనే శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్ గౌడ్, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
