Thursday, February 12, 2026
Homeఅంతర్జాతీయంBethlehem | జీసస్ జన్మస్థలంలో క్రిస్మస్ వేడుకలు షురూ

Bethlehem | జీసస్ జన్మస్థలంలో క్రిస్మస్ వేడుకలు షురూ

ప్రభువైన ఏసుక్రీస్తు పుట్టిన చోటు (Jesus Christ Birth Place) బెత్లెహెమ్‌లో క్రిస్మస్ వేడుకలు (Christmas Celebrations) ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ ఆక్రమిత (Israel Occupatied) వెస్ట్ బ్యాంక్‌(West Bank)లోని బెత్లెహెమ్‌లో నేటివిటీ (మాంజర్) స్క్వేర్‌ వద్ద ఒక చర్చి వెలుపల జరిగిన క్రిస్మస్ ట్రీ లైటింగ్ (Christmas Tree Lighting) సెలబ్రేషన్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేవుడి బిడ్డలు ప్రత్యేక ప్రార్థనలు (Special Prayers) నిర్వహించారు.

గాజా యుద్ధం (Gaza War) ప్రారంభమైన తర్వాత ఈ రెండేళ్లలో ఇక్కడ క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహించటం ఇదే తొలిసారి. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో ఈ ప్రాంతంలో ఇక శాంతి నెలకొంటుందనటానికి ఈ వేడుకల ప్రారంభమే ఒక నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. బెత్లెహెమ్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇది పర్యాటక ప్రాంతం అయినప్పటికీ యుద్ధం కారణంగా సందర్శకుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో నిరుద్యోగం, పేదరికం పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News