వనపర్తి జిల్లా సాక్షి దినపత్రిక ఇంచార్జ్ బొల్లెమోని రమేష్ తండ్రి బొల్లెమోని నాగన్న మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నాగన్న మరణం చాలా బాధాకరమని .. నాగన్న లేని బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు చిన్నారెడ్డి మనోధైర్యం చెప్పారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, నాయకులు మొగిలి సత్య రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు రోహిత్, సీనియర్ నాయకులు ఎంట్ల రవి, భాజ శీను, మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు చిన్నారెడ్డి వెంట ఉన్నారు.
- Advertisement -
