Monday, February 16, 2026
HomeజాతీయంCentral Government | కీలకమైన పేర్లు, కార్యాలయాల్లో మార్పులు

Central Government | కీలకమైన పేర్లు, కార్యాలయాల్లో మార్పులు

కేంద్ర ప్రభుత్వం కీలకమైన పేర్లను మార్చింది. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) పేరును ఇక మీదట ‘సేవా తీర్థ్’(Seva Teerth)గా పేర్కొంటారు. రాష్ట్రాల్లో గవర్నర్ల అధికారిక నివాసాల పేరు ‘రాజ్‌భవన్’(Raj Bhavan)ను మార్చి ‘లోక్‌భవన్’(Lok Bhavan)గా నామకరణం చేశారు. వలసవాదానికి గుర్తుగా ఉండటంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సౌత్ బ్లాక్ నుంచి కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ చేయనున్నారు.

ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదలైంది. సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఆఫీసులను మారుస్తారు. ఇక నుంచి న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి తరలిస్తారు. ప్రధానమంత్రి కార్యాలయాన్నీ అక్కడే ఏర్పాటుచేస్తారు. సేవాతీర్థ్-2లో మంత్రివర్గ సచివాలయం(Cabinet Secretariat), సేవాతీర్థ్-3లో జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) కార్యాలయం పనిచేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News