Homeమహబూబ్‌నగర్‌BRS | కదం తొక్కిన బి.ఆర్.ఎస్ శ్రేణులు.

BRS | కదం తొక్కిన బి.ఆర్.ఎస్ శ్రేణులు.

  • గులాబీ మాయమైన పట్టణ రహదారులు.
  • పట్టణములో కనివిని ఎరగని భారీ బైక్ ర్యాలీ.
  • మునిసిపల్ ఎన్నికలకు శంఖం పూరించిన నిరంజనుడు.
  • ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంచార్జ్ స్వామిగౌడ్(మాజీ మండలి చైర్మన్).

మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం పూరించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎన్నికల ఇంచార్జ్ స్వామిగౌడ్(శాసన మండలి మాజీ ఛైర్మెన్)తో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించి పురవీధుల వెంట పర్యటించారు. బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా దాదాపు 1500 బైకులతో తమ సత్తా చాటారు.

BRS Massive Bike Rally Ahead of Municipal Elections2

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించారు అడుగు అడుగున మహిళలు, యువకులు, కార్మికులు, ప్రజలు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. కనివిని ఎరుగని భారీ ర్యాలీ చూసిన ప్రజలు పట్టణ అభివృద్ధి బి.ఆర్.ఎస్ హయాములో పరుగులు పెట్టిందని మున్సిపల్ ఎన్నికలలో బి.ఆర్.ఎస్ విజయ దుందుభి మోగిస్తోంది అని చర్చించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News