Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Collapse | అబద్దాల పునాదులపై ఉన్న కాంగ్రెస్ కూలడం ఖాయం.

Collapse | అబద్దాల పునాదులపై ఉన్న కాంగ్రెస్ కూలడం ఖాయం.

  • బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్..

అబద్దాల పునాదులపై ఉన్న కాంగ్రెస్ కూలడం ఖాయమని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అలివికాని, ఆచరణ సాధ్యం కాని 420 హామీలు,6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయలేక ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకు గురయ్యారని విమర్శించారు. నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు బిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ను ఆదరించారని ఇది తట్టుకోలేని ఎమ్మెల్యే అసహనంతో ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 59 మంది సర్పంచులను గెలిపించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రేవంత్ రెడ్డిది ప్రచార ఆర్భాటం.

  • జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్..

రేవంత్ ప్రజాధనాన్ని తన ప్రచార ఆర్భాటల కోసం 3 వేల కోట్లు అందాల పోటీలకు, తెలంగాణ సమ్మిట్, డిల్లీ పర్యటనలకు, ప్రజా పరిపాలన ప్రచారం, ఫుట్ బాల్ స్టేడియం కోసం ప్రజాధనాన్ని వాడి సంక్షేమ పథకాలు బంద్ పెట్టారని ఆరోపించారు. కెసిఆర్ హయాములో 135 గ్రామ పంచాయతీలకు గాను 122 పంచాయితీలు గెలిపించి ప్రజల హృదయాలలో నిలిచారని,
రేవంత్ పాలనలో వైఫల్యం చెందినందుకే 50 శాతం పంచాయతీలకు పరిమితమైయారని ఎద్దేవా చేశారు. ప్రజలు కెసిఆర్ సుస్థిర పాలన, నిరంజన్ రెడ్డి ప్రజాపాలన కోరుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే అబ్బ సొత్తు కాదు.

  • బిఆర్ఎస్ సర్పంచులు నీ గేటు కూడా తొక్కరు.
  • మాజీ ఎంపిపి కృష్ణా నాయక్..

ఎమ్మెల్యే ఎన్ని అరాచకాలు, ప్రలోభాలు, దౌర్జన్యాలకు పాల్పడినా బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి 59 మంది సర్పంచులను గెలిపించారని ప్రజలను, నాయకులను కొనియాడారు. నిరంజన్ రెడ్డి కట్టించిన క్యాంపు కార్యాలయంలో ఉంటూ బిఆర్ఎస్ సర్పంచులను గేటు తొక్కనీయను అంటావా అని ప్రశ్నించారు. నిన్ను గేటు బయటికి మెడపట్టి గెంటే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. తులం బంగారం, మహిళలకు 2500, వృద్ధులకు 4 వేలు, వికలాంగులకు 6 వేలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా, విద్యార్థినులకు స్కూటీ, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతు బీమా ఇచ్చిన తర్వాతనే ఘణపురం మండలానికి రావాలని డిమాండ్ చేశారు.

రెండేళ్లలో ఎమ్మెల్యే చేసింది ఏమీలేదని ఇంకా మూడేళ్లలో ఏమి చేయలేరని ప్రజలు గుర్తించారని.. ఇప్పటికైనా ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మెన్ కర్రీ స్వామి, నాయకులు రాళ్ళ కృష్ణయ్య, ఎద్దుల సాయి కుమార్, స్టార్ రహీమ్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News