Homeఆదాబ్ ప్రత్యేకంBorabanda | కాంగ్రెస్ విజయానికి చేరికలే నాంది..

Borabanda | కాంగ్రెస్ విజయానికి చేరికలే నాంది..

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీకి భారీ షాక్
  • మంత్రి సీతక్క, నవీన్ యాదవ్ సమక్షంలో చేరిన బోరబండ డివిజన్ బీఆర్ఎ ఎస్ నాయకులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారబోతుంది.. బోరబండ సైట్-3 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ప్రజాసభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యువకులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, యువతకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. బీఆర్ఎస్కు గట్టి దెబ్బగా భావిస్తున్న ఈ చేరికల్లో, బోరబండ మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అభ్యర్థి జమీర్ భాష కూడా కాంగ్రెస్లో చేరారు.

- Advertisement -
borabanda jubilee hills congress brs leaders join seethakka naveen yadav

బోరబండ వీధులు కాంగ్రెస్ జెండాలతో, నినాదాలతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు, మహిళలు, యువత భారీగా హాజరై నవీన్ యాదవ్, సీతక్కలకు ఘన స్వాగతం పలికారు. ఈ చేరికలతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊపందగా, బీఆర్ఎస్కు మాత్రం తీవ్ర షాక్ తగిలినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పదేళ్ల విధ్వంస పాలనకు, 2 ఏళ్ల వికాస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి వచ్చాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.

borabanda jubilee hills congress brs leaders join seethakka naveen yadav 2

జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పదేళ్ల పాలనలో ఏం జరిగిందో ఆలోచిం చండి. రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. యువ తకు మత్తుకు బానిస చేశారు. ప్రతి పక్షాల విష ప్రచారం నమ్మవద్దు, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా పనిచేస్తుంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ లాంటి శ్రామిక నాయకులు అవసరం.

borabanda jubilee hills congress brs leaders join seethakka naveen yadav. j1pg

ఈ చేరికలు పార్టీ 200 పెంచడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం మరింత బలపరుస్తాయని తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోరబండలోని యువతలో రాజకీయ చైతన్యం పెరిగింది. వారు కాంగ్రెస్ పతాక కింద జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తారు. మన లక్ష్యం కేవలం ఎన్నిక గెలవడం కాదు.. ప్రతి వాడికి న్యాయం, అభివృద్ధి అందించడమే లక్ష్మని అన్నారు.

కాంగ్రెస్లో చేరిన యువతలో హర్బజ్, మున్నీస్, నవాజ్, షాహిద్, ఆసిఫ్, రహిమాన్, రియాన్, ఇబ్రహీం, ఫిరోజ్, అభుజార్, వినయ్, అజార్, సిరాజ్, సయ్యద్ రిహాన్ తదితరులు ఉన్నారు. వారు మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. ఆయన గెలుపులో భాగస్వాములమై, యువత అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసి యుద్దీన్, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, అలాగే స్థానిక కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News