భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ’ కార్యక్రమంపై మండలస్థాయి విస్తృత కార్యశాల నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మట్ట నరేష్‌గౌడ్ అధ్యక్షతన లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
కార్యశాలకు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరై మాట్లాడుతూ,ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎస్ఐఆర్ విస్తృత కార్యశాల ఇన్చార్జి రాంభూపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, సీనియర్ నాయకుడు కృష్ణగౌడ్ పాల్గొని, కార్యక్రమ లక్ష్యాలు, బాధ్యతలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సురేందర్‌గౌడ్, ఎన్.శేఖర్‌రెడ్డి, రహమతుల్లా, మండల ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, మండల ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, అంజన్‌రెడ్డి, బాలరాజుగౌడ్, లింగారెడ్డి, కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, బీసీ మోర్చా మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, బి.శంకర్‌గౌడ్, సురేష్‌గౌడ్, వెంకటేష్, శివతోపాటు పార్టీ ముఖ్య నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, బూత్ అధ్యక్షులు, ఎస్ఐఆర్ శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బీఎల్ఏ-2లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
