Friday, February 20, 2026
Homeరంగారెడ్డిPalamuru MLC | దైవచింతనతోనే మానసిక ప్రశాంతత.

Palamuru MLC | దైవచింతనతోనే మానసిక ప్రశాంతత.

  • పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి.
  • వైభవంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి కళ్యాణోత్సవం.
  • కళ్యాణోత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి పేర్కొన్నారు. నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి కళ్యాణాన్ని బుధవారం వేదం పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సావాన్ని వెంకమ్మగూడ సర్పంచ్ గొర్లపల్లి అశోక్,చేగూర్ సర్పంచ్ మంకాల శ్రీశైలం దంపతులు కళ్యాణాన్ని జరిపించారు.

ఈ కళ్యాణోత్సవంలో పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని, దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవరచుకోవాలని, అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.ఆ భ్రమరాంబ మల్లేశ్వరుని ఆశీర్వాదంతో ప్రజలందరూ సుభిక్షంగా,ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు అతిథులకు మేమేంటోలను అందజేసి,శాలువలతో సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేయడంతో ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్,మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్,మాజీ పిఏసీఎస్ మామిళ్ల విఠల్, సర్పంచులు జెట్ట కుమార్,సాలయ్య,పాండు,హన్మంత్ రెడ్డి,ఉప సర్పంచ్ అవులమంద శివశంకర్,మాజీ సర్పంచులు బుయ్యన్ని రజినిత వీరేందర్ గౌడ్,జిల్లెళ్ల వెంకట్ రెడ్డి,శ్రవణ్ పట్వారీ,బండి నిలమ్మరాజు,కావలి కృష్ణ, దేవాలయ కమిటీ అధ్యక్షులు సతీష్ పటేల్, నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి, పెబ్బే శేఖర్,సాములయ్య,గుండాల వేణు,పసుల బుచ్చయ్య,జంగిలి కుమార్,బంటారం మల్లేష్,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News