Friday, March 13, 2026
Homeరంగారెడ్డిBSP | ఛలో బడంగ్‌పేటకు బహుజన సమాజ్ పార్టీ పిలుపు

BSP | ఛలో బడంగ్‌పేటకు బహుజన సమాజ్ పార్టీ పిలుపు

బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాన్షీరామ్ జన్మదినం సందర్భంగా ఛలో బడంగ్‌పేట బహుజన రాజ్యాధికార యుద్ధభేరి సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 15న ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి బడంగ్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఈ సభలో బహుజన సమాజానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు.

మహాత్మ జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సభ ద్వారా పిలుపునిస్తున్నట్లు చెప్పారు. బహుజనులు ఐక్యంగా ఉండి తమ ఓటు హక్కును ఉపయోగించుకొని రాజకీయంగా బలపడాలని, సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. కాన్షీరామ్ చూపించిన మార్గంలో నడుస్తూ బహుజన సమాజానికి రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యమని వివరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి బి.ఎస్.పి అధినేత్రి మాయావతి చిత్రపటంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ సహా పలువురు నాయకుల ఫోటోలు కరపత్రంలో ముద్రించినట్లు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో బహుజన సమాజానికి చెందిన ప్రజలు హాజరుకావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News