ఎల్లుండి (31న) ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammad Azharuddin)కు ప్రమోషన్ (Promotion) లభించింది. ఆయనకు తెలంగాణ మంత్రివర్గం(Telangana Cabinet)లో చోటు దక్కనుంది. అజహరుద్దీన్‌కి హోం(Home), మైనారిటీ (Minority) శాఖ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎల్లుండి 31వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం(Oath ceremony) ఉంటుందని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubileehills ByElection) నేపథ్యంలో ఏఐసీసీ (Aicc) తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ నియోజకవర్గంలోని ముస్లిం (Muslim Votes) ఓట్ల(1,18,789)పై ఆశతోనే ఆగమేఘాలపై అజహరుద్దీన్‌ని అందలం ఎక్కిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన ఆయనకు అది అందకపోయేసరికి డీలా పడ్డారు. అయితే.. అజహరుద్దీన్‌ని ఎమ్మెల్సీ (Mlc) చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా మంత్రి (Minister) పదవి కూడా వరించబోతోంది. క్యాబినెట్‌లో మైనారిటీలు లేరనే లోటును సైతం భర్తీ చేసినట్లు ఉంటుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
