న్యూజెర్సీలో విశేషంగా అలరించిన ‘చిత్ర గాన లహరి’
ప్రముఖ నేపథ్య గాయని (Playback Singer) చిత్ర (Chitra) అమెరికా(America)లోని న్యూజెర్సీ(New Jersey)లో ఇటీవల నిర్వహించిన ‘చిత్ర గాన లహరి’ (Chitra Gana Lahari) ప్రేక్షకులను (Audience) ఉర్రూతలూగించింది. ఫేమస్ సింగర్ శ్రీకృష్ణ (Singer Srikrishna) కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్లెయిన్‌ఫీల్డ్ హైస్కూల్ ఆడిటోరియంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America-Tana: తానా), కళా వేదిక (Kalavedika), గుడ్ వైబ్స్ (Good Vibes) సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ తెలుగు సంగీత విభావరి (Telugu Music Program) విశేషంగా అలరించింది.

ఆపాత మధురం లాంటి తెలుగు సినీ గీతాలు (Golden Telugu Songs), శ్రవణానందకరమైన గానం, శ్రోతల కరతాళ ధ్వనులు (Claps) మిన్నంటాయి. నిర్వాహకులు ప్రదర్శనకారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు, ఎడిసన్ సిటీ మేయర్ (Edison City Mayor) శామ్ జోషి తదితరులు పాల్గొన్నారు.

