Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Amaravathi | అమరావతికి చట్టబద్దత కల్పించండి

Amaravathi | అమరావతికి చట్టబద్దత కల్పించండి

జీ రామ్ జీ స్కీం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆర్థిక సాయం అందించండి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాజధాని(AndhraPradesh Capital)గా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu).. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amitshah)ను కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి(Union Minister For Home)తో భేటీ అయ్యారు. ఏపీలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల(Development, Welfare Schemes) అమలుపై చర్చించుకున్నారు. రాజధానికి చట్టబద్దత కల్పించడం వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు. ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని, ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలపై వీరిద్దరు చర్చించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News