Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Alphores | విద్యార్థులను అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి

Alphores | విద్యార్థులను అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి

విద్యార్థులకు వైజ్ఞానిక శాస్త్రం పట్ల అవగాహన కలిగించి వాటిలోని విషయాల పట్ల సంపూర్ణంగా సమాచారం ఇవ్వాలని తద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తారని మ విషయాలలో పట్టు సాధించడం ద్వారా విజయాలను సైతం సులభంగా నమోదు చేయగలుగుతారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చెందినటువంటి విద్యార్థులు ఇటీవల జరిగినటువంటి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా స్థాయి ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజ్ఞానిక శాస్త్రం చదవడం ద్వారా విద్యార్థులకు చాలా అవగాహన వస్తుందని పలు విషయాలలో పట్టు సాధిస్తారని ప్రత్యేకంగా విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తున్నామని వైజ్ఞానిక శాస్త్రంలోని విషయాల పట్ల పరిశోధనాత్మకంగా ప్రత్యక్షంగా బోధించడం ద్వారా వారిలో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామని వారు చెప్పారు.

- Advertisement -

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయిన ఆల్ ఫోర్స్ పాఠశాలల విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య జిల్లా సైన్స్ అధికారి శ్రీ జైపాల్ రెడ్డి డిసిఇబి కార్యదర్శి శ్రీ భగవంత అభినందించారు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు

విద్యార్థుల్లో నూతన ఉత్సాహం నింపి అత్యుత్తమ నమూనాలతో ప్రదర్శనకై కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ జాతీయస్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ చాటే విధంగా ప్రోత్సాహం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News