HomeజాతీయంAdani | గణేష్ మండపాలకు అండగా అదానీ గ్రూప్..

Adani | గణేష్ మండపాలకు అండగా అదానీ గ్రూప్..

  • ముంబైలో గణేష్ మండపాలకు రెసిడెన్షియల్ రేట్లు..
  • దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే కనెక్షన్..

ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల సందర్భంగా నగరంలోని మండపాలకు అండగా నిలుస్తున్నట్లు అదానీ(Adani Electricity) ఎలక్ట్రిసిటీ ప్రకటించింది. ఉత్సవాల కోసం ఏర్పాటు చేసే మండపాలకు నివాస గృహాలకు వర్తించే ధరలకే (రెసిడెన్షియల్ రేట్లు) తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే కనెక్షన్ మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.

పండగ స్ఫూర్తిని నిరంతరాయ విద్యుత్‌తో జరుపుకునేలా చూడటమే తమ లక్ష్యమని అదానీ ఎలక్ట్రిసిటీ(Adani) ప్రతినిధి తెలిపారు. “గణేశ్ మండపాలకు నమ్మకమైన తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు అందించడం ద్వారా ఉత్సవాలు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూడాలనుకుంటున్నాం. మా వినియోగదారులకు సేవ చేయాలన్న మా నిబద్ధతకు ఇది నిదర్శనం” అని ఆయన వివరించారు. తాత్కాలిక కనెక్షన్ కోసం మండపాల నిర్వాహకులు తమ అధికారిక వెబ్‌సైట్ adanielectricity.com లోని ‘న్యూ కనెక్షన్’ విభాగాన్ని సందర్శించాలని సూచించింది.

- Advertisement -

“గతేడాది నగరవ్యాప్తంగా 1,000కి పైగా గణేశ్ మండపాలకు నిరంతరాయ విద్యుత్‌ను విజయవంతంగా అందించాం. ఈసారి కూడా కనెక్షన్ల ఆమోదాన్ని వేగవంతం చేయడానికి, పండగ మొత్తం నమ్మకమైన సరఫరాను కొనసాగించడానికి పూర్తి ఏర్పాట్లు చేశాం. ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించేందుకు మా క్విక్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి” అని ప్రతినిధి తెలిపారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మండపాలలో ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం అధీకృత లైసెన్స్ ఉన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల సేవలను మాత్రమే వినియోగించుకోవాలని నిర్వాహకులను కోరింది. అంతేకాకుండా, నగరంలోని 167 విగ్రహ నిమజ్జన ప్రాంతాల్లో 2,958 ఫ్లడ్‌లైట్లతో వెలుగులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధి వెల్లడించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News