Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌ACB Raid | శేర్లింగంపల్లి సర్కిల్–49 కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

ACB Raid | శేర్లింగంపల్లి సర్కిల్–49 కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

శేర్లింగంపల్లి సర్కిల్–49 కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఏసీపీ స్థాయి అధికారులు సిబ్బందితో కలిసి కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌తో పాటు ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు. పలు అనుమతులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుని సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

ఈ సోదాల నేపథ్యంలో కార్యాలయంలో కొంతసేపు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News