Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌ACB Raid | సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడి

ACB Raid | సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడి

  • 35000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆడిట్ అధికారి సంతోష్
  • రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులు ఫిర్యాదు తో బయటపడిన అవినీతి

అవినీతి ఎక్కడ జరిగిన అవినీతి నిరోధక శాఖను సంప్రదించి తన సమస్యను చెప్పుకోవాలని హైదరాబాద్ సిటీ రేంజ్ టు ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయంలో ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న సంతోష్ అనే అధికారి రిటైర్మెంట్ ఉద్యోగి నుండి 35000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులు అనే వ్యక్తి తన బెనిఫిట్స్ సుమారుగా 28 లక్షల రూపాయలు రావలసి ఉండగా అందుకు సంబంధించిన ఫైలు ను ఆడిట్ అధికారి సంతోష్ దగ్గర ఆగిపోయింది.ఆరు నెలలుగా ఫైల్ పై సంతకం చేయకుండా ఆంజనేయులును పదే పదే తిప్పుతుండడంతో విసిగిత్తిన బాధితుడు ఆంజనేయులు ఆడిట్ అధికారి సంతోష్ ను ఏమి కావాలి అని నేరుగా అడిగాడు.అందుకు అధికారి 40000 లంచం అడగగా 35 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

- Advertisement -

దీంతో చేసేది ఏమీ లేక రిటైర్డ్ ఉద్యోగి ఆంజనేయులు అవినీతి నిరోధక శాఖను సంప్రదించడం జరిగిందని శ్రీధర్ తెలిపాడు.ఈ మేరకు పక్క ప్రణాళికతో ఆడిట్ అధికారి సంతోష్ పై నిగా పెట్టి ఆంజనేయులునుండి డిమాండ్ చేసిన డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ నేరుగా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News