Friday, March 13, 2026
Homeనల్లగొండACB | మోత్కూర్ సబ్ ట్రెజరీ ఆఫీస్ పై ఏసీబీ తనిఖీలు

ACB | మోత్కూర్ సబ్ ట్రెజరీ ఆఫీస్ పై ఏసీబీ తనిఖీలు

  • ఉద్యోగుల వేతన బిల్లు పాస్ చేసేందుకు లంచం తీసుకున్న ఫిర్యాదు పై సీనియర్ అసిస్టెంట్ ఖదీర్ అరెస్ట్
  • ఖదీర్ పై కలెక్టర్,ఏసీబీకి ఫిర్యాదు చేసిన మోత్కూర్ ఎంపీవో పి.జనార్ధన్ రెడ్డి
  • ఈ కేసు నల్లగొండ డిఎస్పి జగదీష్ చందర్ నల్గొండ రేంజ్ స్టాప్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

మోత్కూర్ మండల పంచాయతీ అధికారి పి.జనార్దన్ రెడ్డి తన 07-02 -2024 నుంచి 15-3-2024 వరకు 38 రోజుల వేతన బకాయిలకు సంబంధించి రూ.1,09,384 లో బిల్లును మంజూరు చేయడానికి మోత్కూర్ సబ్ ట్రెజరీ ఆఫీస్ లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎండి ఖదీర్ వద్దకు వెళ్లగా అతను రూ.10 వేలు లంచం ఇవ్వాల్సిందని డిమాండ్ చేయగా,రూ.5వేలు ఒప్పందం కుదుర్చుకొని సహ ఉద్యోగి ఖాతాకు ఫోన్ పే ద్వారా బదిలి చేశారు.

అదేవిధంగా 27-02-2026 నెల వేతనం రూ.88,679 లను మంజూరు చేయడానికి ఫైనాన్షియల్ ఇయర్ అని ఐటి సాకుగా చూపి మరో రూ.5 వేలను ఫోన్ పే ద్వారా తన సొంత ఖాతాకు బదిలీ చే యించుకున్న తర్వాత బిల్లును ఆన్ లైన్ చేసి టోకెన్ జారీ చేసినా కూడా ఆలస్యం చేశాడు.

- Advertisement -

అలాగే గుండాల మండల ప్రజా పరిషత్ లో మరో ఉద్యోగి నుంచి కూడా బిల్లు పాస్ చేయడానికి రూ.5000 లు లంచం వసూలు చేసాడు.వీరిద్దరూ ఈ విషయం పై ఈనెల మార్చి 4న ఏసీబీ రేంజ్ కార్యాలయానికి ఎంపీఓ పి.జనార్దన్ రెడ్డి ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చారు.ఈనెల 7న కలెక్టర్ కు కంప్లైంట్ ఇవ్వగా కలెక్టర్ డిస్టిక్ ట్రెజరీ అధికారిని ఎంక్వయిరీ కి పంపారు.

గురువారం నల్గొండ డి.ఎస్.పి రేంజ్ జగదీష్ చందర్ అండ్ స్టాఫ్ అధికారులు మోత్కూరు ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భువనగిరిలో ఉండే ఖదీర్ ఇల్లును సోదాలు చేస్తూ,అతని లావాదేవీలను ఎంక్వయిరీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.అనంతరం అతన్ని అరెస్టు చేసామని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో శుక్రవారం హాజరు పరుస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News