చట్టాలు కొందరికి చుట్టాలు.. చట్టాలు పట్టుకొని.. చట్టాలు చెప్పుకొని నల్ల కోటు ధరించి సింహాసనం పై అధిష్టించి.. నీతి బోధనలెన్నో చెప్పి.. కోట్లు కొల్లగొట్టినా .. నిన్ను ఏమి అనరు.. నిన్ను ఏమి చేయరు.. ఎందుకంటే నీవు చట్టానికి ప్రభువువి.. చట్టం నీ చేతిలో ఉంది.. చట్టమే నీ చుట్టము బాస్.. కానీ అదే పెదోడు.. వంద రుపాయలు లంచం తీసుకున్నాడని నెపం వేసి నేరమే లేకున్నా నెరగాన్ని చేసి.. అన్యాయ శిక్షణ వేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసిందే.. ఇదేమి న్యాయం.. న్యాయ నిర్ణేతకు ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయమా.. ఓ స్వతంత్ర భారతమా.. ఇవి ఏమి చట్టాలు.. వింత తీర్పులు.. ఓ భారతమా కళ్ళు తెరువు.. న్యాయ, అన్యాయలు.. తెలుసుకో ఇకనైనా..
By-జ్వాల
