- గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై సింగాపురంలో అవగాహన కార్యక్రమంHPV Vaccination Awareness
- 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతపై వైద్యుల అవగాహన
బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి వారిని కాపాడేందుకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ సింగాపురం గ్రామంలో హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్లు ఆనంద్, వసంత మహేందర్ రెడ్డి, గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది హెచ్‌పీవీ వైరస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను, ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ఈ వైరస్ ప్రధాన కారణాల్లో ఒకటని వివరించారు.HPV Vaccination Awareness
ఈ క్యాన్సర్‌ను ముందస్తు నివారణ చర్యల ద్వారా అరికట్టడంలో హెచ్‌పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం14 ఏళ్ల బాలికలకు అందించే హెచ్‌పీవీ టీకా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు అపోహలు, అనవసర భయాలకు లోనుకాకుండా వైద్యుల సలహాలు తీసుకుని అర్హులైన బాలికలకు టీకా వేయించాలని సూచించారు.
బాలికల ఆరోగ్యం కుటుంబానికే కాదు.. సమాజానికి కూడా ఎంతో ముఖ్యమని, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమమని వైద్య సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, తల్లిదండ్రులు పాల్గొని వ్యాక్సినేషన్‌పై అవగాహన పొందారు.బాలికల ఆరోగ్యమే బంగారు భవిష్యత్తుకు పునాది.. క్యాన్సర్ నివారణ దిశగా హెచ్‌పీవీ టీకా ఒక కీలక ముందడుగు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
