- హైదరాబాద్ లో తొలి ఆపిల్ రిటైల్ స్టార్ ప్రారంభం..Apple Hyderabad Store
- గుడ్ న్యూస్ చెప్పిన ఆపిల్ యాజమాన్యం..
ప్రముఖ టెక్ దిగ్గజం “ఆపిల్”కి మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ లలో ఐ ఫోన్ లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐ ఫోన్ నుంచి కొత్త సిరీస్ లను లాంఛ్ చేస్తూ లక్షల మంది వినియోగదారులను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా కొత్త ఫోన్ లాంఛ్ సమయంలో ఏ రేంజ్ లో హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి ముందు రోజు నుంచే స్టోర్ల వద్ద కస్టమర్లు పడిగాపులు కాస్తున్న కాసిన వీడియోలు ఇప్పటికే ఎన్నో సార్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాసులకు ఈ సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది.Apple Hyderabad Store
కాగా ఆపిల్ హైదరాబాద్‌లో తమ తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన కూకట్‌పల్లిలోని లేక్‌షోర్-వై జంక్షన్ మాల్‌లో ఆపిల్, కూకట్పల్లి స్టోర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని అనౌన్స్ చేసింది. అందులో భాగంగానే ఈ కొత్త స్టోర్‌కు సంబంధించిన ప్రత్యేక బ్యారికేడ్ డిజైన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ఉన్న ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ పేరును గుర్తు చేసేలా ముత్యాల స్ఫూర్తితో ఈ లోగో డిజైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. భాగ్యనగరానికి ప్రపంచవ్యాప్తంగా ముత్యాల వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
