HomeసినిమాShruti Haasan | సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన శ్రుతిహాసన్..

Shruti Haasan | సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన శ్రుతిహాసన్..

  • ఆమె నటనకు అభిమానులు ఫిదా..Shruti Haasan
  • వెండితెరపై మ్యాజిక్ చేసిన లేడీ కమల్ హాసన్..

దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన స్ఫూర్తిదాయక డ్రామా ఆకాశంలో ఒక తార ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వ్యోమగామి కావాలనే కలలను నిజం చేసుకునే యువతి ప్రయాణం చుట్టూ సాగే ఈ చిత్రంలో ప్రతి పాత్రకు తనదైన ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో రోహిణి పాత్రతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది శ్రుతిహాసన్. చాలా కాలంగా సినిమాలు తగ్గించిన ఆమె.. ఈ మూవీతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసింది.Shruti Haasan

స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, తనదైన తీక్షణమైన అభినయంతో ఆమె ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె పాత్రకు, నటనకు అడియన్స్ , విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆకాశంలో ఒక తారలో రోహిణి పాత్రను శృతి హాసన్ పోషించిన విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఆమె పాత్ర వ్యక్తిత్వం, డైలాగ్స్ లోని దృఢత్వం, భావోద్వేగాల తీవ్రత కథకు బలాన్ని చేకూర్చాయి. కథానాయిక కల్పనలో ఉన్న పట్టుదలను, తపనను గుర్తించే పాత్రగా రోహిణి కనిపిస్తుంది. అనవసరమైన హంగులకు తావులేకుండా, సహజమైన హావభావాలతో శృతి హాసన్ పండించిన సన్నివేశాలు సినిమాలో మరపురాని క్షణాలుగా నిలిచాయి.

- Advertisement -

ఆమె నటన చూసిన అభిమానులు లేడీ కమల్‌హాసన్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. ఇది కేవలం అభిమానంతో అనే మాటలా కాకుండా, ఆమె నటనకు దక్కిన గుర్తింపుగా నిలుస్తోంది. కల్పన పాత్రతో పరిచయమైన సాత్విక వీరవల్లి పరిణతి చెందిన నటనతో మెప్పించగా, కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ సహజమైన అభినయంతో ఆకట్టుకున్నారు. రుహానీ శర్మ, స్వాసిక తమ పాత్రలకు న్యాయం చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News