- అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా క్రమాలు..Kiran Abbavaram Record
- హాజరైన సుకుమార్, నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘రికార్డ్’ లాంఛనంగా ప్రారంభమైంది(Kiran Abbavaram Record). ఇది ఆయన కెరీర్‌లో 14వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి వీర కొగటం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సుకుమార్ రైటింగ్స్’ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, నిర్మాతలు వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘రికార్డ్’ అనే టైటిల్‌కు తగినట్లుగానే కెమెరా ఇంటర్‌ఫేస్ థీమ్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వీర మాట్లాడుతూ.. ఈ సినిమా కథ కర్నూలులోని ప్రసిద్ధ కొండారెడ్డి బురుజు నేపథ్యంలో సాగుతుందని వెల్లడించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. మరోవైపు, కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తాను స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ‘రియాలిటీ’ అనే చిత్ర పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రియాలిటీ’ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆయన తన 14వ చిత్రాన్ని పట్టాలెక్కించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
