Homeభక్తిSrisailam Temple | శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

Srisailam Temple | శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

  • కార్తీక సోమవారం కావడంతో పెరిగిన రద్దీ..Srisailam Temple
  • పాతాళ గంగలో పుణ్యస్నానాలు..

శ్రీశైల క్షేత్రంలో(Srisailam Temple) భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండటంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. నిన్న స్వామి, అమ్మవార్లను 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ]

ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థానం తరఫున ఈవో వెంకటరావు ఆత్మీయ స్వాగతం పలికారు.ముందుగా ఆలయంలోని అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని శిల్పాశెట్టి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. తదుపరి ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో శిల్పాశెట్టిని సత్కరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి స్వామివారి ప్రసాదాలను అందజేయడంతో పాటు జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ, 120వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News