- యువతీ వ్యక్తిగత చిత్రాలు డౌన్లోడ్..Indian Man in America
- పోలీసుల ముందు తప్పు ఒప్పుకున్నా రఘుల్..
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. (Indian Man in America) భారత సంతతికి చెందిన రఘుల్ ఆనందకృష్ణన్ (29) అక్కడి క్యాపిటల్ ప్లాజా షాపింగ్ సెంటర్లో ఉన్న టోటల్ వైర్లెస్ స్టోర్‌లో పనిచేసేవాడు. ఈ ఏడాది జూన్ 7న ఓ మహిళ తన ఐఫోన్లో నెట్వర్క్ సెట్టింగ్స్ మార్చుకునేందుకు ఆ స్టోర్‌కు వెళ్లింది. ఆమె ఫోన్‌ను పరిశీలించేందుకు రఘుల్ పాస్‌కోడ్ అడిగాడు. ఆమె కూడా నమ్మకంతో ఫోన్‌ను అతడికి ఇచ్చింది. అయితే ఫోన్‌ను స్టోర్ వెనుక భాగానికి తీసుకెళ్లిన రఘుల్ నెట్వర్క్ సెట్టింగ్స్ చూడాల్సింది పోయి ఫొటో గ్యాలరీని తెరిచాడు. అందులో ఉన్న మహిళ వ్యక్తిగత నగ్న చిత్రాలను తన ఫోన్‌కు పంపించుకున్నాడు.
ఇందుకోసం ఎయిర్‌డ్రాప్ ఫీచర్‌ను ఉపయోగించాడు. పోలీసుల విచారణలో రఘుల్ తన తప్పును అంగీకరించాడు. మహిళ తన ఫోన్ పాస్‌కోడ్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే నెట్వర్క్ సెట్టింగ్స్ మార్చేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని అతడు అంగీకరించాడు. అయినప్పటికీ ఫోన్లోని ఫొటోలను తెరిచి రెండు నగ్న చిత్రాలను తన ఫోన్‌కు పంపించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే ఆ ఫొటోల బదిలీ పూర్తికాలేదని, ఆ తర్వాత ఫోన్‌ను మహిళకు తిరిగి ఇచ్చేశానని పోలీసులకు చెప్పాడు కానీ ఈ వ్యవహారం అక్కడితో ముగియలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
