Homeబిజినెస్PPF Loan | పీపీఎఫ్ ద్వారా లోన్..

PPF Loan | పీపీఎఫ్ ద్వారా లోన్..

  • బాలన్స్ లో 25 శాతం అప్పుగా పొందే అవకాశం..PPF Loan
  • మూడేండ్లలోపు అప్పు చెల్లిస్తే వడ్డీ రేటు ఎక్కువ పొందే ఛాన్స్..

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) అనేది పెట్టుబడికున్న ఓ అవకాశం మాత్రమే కాదు (PPF Loan).. దీర్ఘకాలంలో పన్ను రహిత రిటైర్మెంట్‌ నిధి సృష్టికీ చక్కని మార్గం. అలాగే ఖాతా తెరిచిన 3-6 ఆర్థిక సంవత్సరాల మధ్య అప్పటిదాకా ఉన్న నగదు నిల్వలపై రుణ సదుపాయాన్ని కూడా తీసుకోవచ్చు. బ్యాలెన్స్‌లో 25 శాతాన్ని అప్పుగా పొందవచ్చు. విశేషమేమిటంటే.. అప్పు తీసుకున్న మూడేండ్ల (36 నెలలు)లోపు తిరిగి చెల్లిస్తే వార్షిక వడ్డీరేటు మన డిపాజిట్లపై వస్తున్న వడ్డీరేటు కంటే 1 శాతం మాత్రమే ఎక్కువ.

చెల్లించకపోతే మిగిలిన రుణ బకాయిలపై అదనంగా 6 శాతం వార్షిక వడ్డీరేటు పడుతుంది. ఉదాహరణకు పీపీఎఫ్‌ ఖాతాను తెరిచిన మూడేండ్ల తర్వాత ఖాతాలో రూ.2 లక్షల బ్యాలెన్స్‌ ఉన్నది. దీనికి వర్తిస్తున్న వార్షిక వడ్డీరేటు 7.1 శాతం. ఇక పీపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 25 శాతాన్ని (రూ.50,000) లోన్‌గా తీసుకోవచ్చు. అయితే ఈ రుణాన్ని మూడేండ్లలోపు చెల్లిస్తే వార్షిక వడ్డీరేటు 8.1 శాతమే పడుతుంది. ఒకవేళ చెల్లించకపోతే ఇంకా మిగిలి ఉన్న రుణ బకాయిలపై 13.1 శాతం వడ్డీని కట్టాల్సి వస్తుంది. అలాగే లోన్‌ తీర్చేదాకా పీపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో ఆ రుణ బకాయిలకు సమానమైన నగదు నిల్వలకు వడ్డీ ఆదాయం రాదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News