Homeనల్లగొండIlapuram | మిగిలిన రోడ్డు భూమిని కాపాడాలి.

Ilapuram | మిగిలిన రోడ్డు భూమిని కాపాడాలి.

  • ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కలెక్టర్‌కు ఐలాపురం యువకుడు వినతి.

చివ్వెంల: ఎన్ హెచ్-365 BB సూర్యాపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఐలాపురం(Ilapuram) స్టేజి సమీపంలో గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డులో కొంత భాగం తొలగించారని, ఐలాపురం ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద విస్తరణ అనంతరం మిగిలిన రోడ్డు భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఐలాపురం గ్రామానికి చెందిన బోడపట్ల ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణ ప్రయత్నాలకు గ్రామపంచాయతీ పాలకవర్గం సహకరిస్తున్నట్లు ఆరోపించారు.

ఈ విషయంపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇది తమ పరిధిలోకి రాదంటూ ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టుకుంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, జాతీయ రహదారి విస్తరణ అనంతరం మిగిలిన పంచాయతీరాజ్ రోడ్డు భూమి ఎంత ఉందో నిర్ధారించాలని, దానికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News