Homeనిజామాబాద్‌Indiramma Family Life Insurance | ఇందిరమ్మ జీవిత బీమా పథకం... ప్రతి కుటుంబానికి ఆర్థిక...

Indiramma Family Life Insurance | ఇందిరమ్మ జీవిత బీమా పథకం… ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా…!

  • నిరుపేద కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..!Indiramma Family Life Insurance
  • దేవయపల్లి లో పథకాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు..!

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన (Indiramma Family Life Insurance) ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నరేష్, ఉపసర్పంచ్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Indiramma Family Life Insurance

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పించి, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ప్రతి కుటుంబం పథకం వివరాలను తెలుసుకొని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతకు ఇలాంటి పథకాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవులు, మండల ప్రత్యేక అధికారి రఘునందన్, ఎంపీడీవో భరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పైడి రాజేశ్వర్ రెడ్డి, తాడ్వాయి సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, దేమె సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, అంబీర్ శ్యాంరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ, రాజేందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News