Homeఆదిలాబాద్Medical College Construction| వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాల

Medical College Construction| వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాల

జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల (Medical College Construction) నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, బుధవారం నిర్మల్ పట్టణంలో ప్రస్తుతం నిర్వహించబడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో సంబంధిత అధికారులతో, నూతన వైద్య కళాశాల నిర్మాణ వివరాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన వైద్య కళాశాల నిర్మాణ పురోగతిని శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని విధాలైన సౌకర్యాలతో కూడిన వైద్య కళాశాల నిర్మించాలన్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుగా అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. చేపట్టిన పనులు నాణ్యవంతంగా ఉండాలన్నారు. విద్యార్థుల వసతి నివాసాల నిర్మాణాలు కూడా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో వైద్య విద్యను అభ్యసించి, వసతి పొందేందుకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టాలన్నారు. కళాశాల నిర్మాణ పనులు అన్నింటిని తానే స్వయంగా ప్రతి వారం సమీక్షిస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, ఆర్ అండ్ బి ఎఈ అంజనేశ్వర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube) 

- Advertisement -
RELATED ARTICLES

Latest News