సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని (Road accident) రాజా నాయక్ తండా సమీపంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మహిళ తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఆమె సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహిళ కుడి చేతిపై ‘పి. వసంత’ అనే పేరు పచ్చబొట్టుగా ఉంది. ఆమెను ఎవరైనా గుర్తించినా, కుటుంబ సభ్యులు లేదా బంధువుల వివరాలు తెలిసినా వెంటనే సూర్యాపేట రూరల్ ఎస్ఐకు 8712686030 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
- Advertisement -
