- కొట్టిపడేసిన యూబీటీ నేత సంజయ్ రౌత్..Sanjay Raut
- ఇరువురు నాయకుల మధ్య ఎలాంటి మీటింగ్ జరుగలేదు..Sanjay Raut
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కలవవని శివసేన నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఆ రెండు వర్గాలు విలీనం అవుతాయని వస్తున్న వార్తలను ఆయన కొట్టివేశారు. ఆ వార్తలను కాల్పనిక కథగా అభివర్ణించారు. ముంబైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శరద్ పవార్, సుప్రియా సూలె.. బీజేపీ క్యాంపులో చేరరని స్పష్టం చేశారు. ఎన్సీపీ లీడర్లు సుప్రియా సూలె, ప్రఫుల్ పటేల్ మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని తెలిపారు.
వివిధ లీడర్లు హాజరైన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో విలీనం గురించి ఎలా చర్చించగలం? ఆ సమావేశం ఉదయం 11 నుంచి సాయంత్ర 5 గంటల వరకు జరుగుతుంది. అలాంటి సమావేశంలో విలీనం గురించి చర్చించడం సాధ్యమేనా? ఎన్సీపీ వర్గాల మధ్య విలీనం జరగదు గాక జరగదు. ఈ విషయాన్ని నేను వంద శాతం నమ్మకంతో చెబుతున్నా. విలీనం గురించి వస్తున్న వార్తలకు మరో రెండు రోజుల్లో తెరపడుతుంది. అమిత్ షా ఎన్సీపీ శరద్ పవార్, సుప్రియా సూలె చేరరు’ అని రౌత్ వ్యాఖ్యానించారు. ఆ విలీనంపై బీజేపీ కావాలనే గందరగోళం సృష్టిస్తున్నదని సంజయ్ ఆరోపించారు.
తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపైనా సంజయ్ రౌత్ స్పందించారు. ప్రముఖ రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ప్రశ్నించారు. ‘రాష్ట్రపతి ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుండవచ్చు. అలాగే మిలిటరీ అధికారుల ఫోన్లు కూడా దీనికి మినహాయింపు కాదు’ అని రౌత్ పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో దేశ రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతాయని, ప్రధాని నరేంద్ర మోదీ తన పదవి నుంచి దిగిపోతారని, దీనికి వివిధ కారణాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
