HomeతెలంగాణEatala Rajendar | రాహుల్ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు..

Eatala Rajendar | రాహుల్ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు..

  • రేవంత్ ప్రభుత్వం ప్రజల ఉసురు పోసుకుంటోంది..Eatala Rajendar
  • తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్..Eatala Rajendar

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ (Eatala Rajendar) ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశ ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ప్రజల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు.

విదేశీ గడ్డపై భారత ఎన్నికల వ్యవస్థను, సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ అపహాస్యం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాటలు, తీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలా లేవని ఎద్దేవా చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులను కూడా అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యమే లేకపోతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర ఎలా చేయగలిగారని ఆయన నిలదీశారు.

- Advertisement -

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. “హైదరాబాద్‌కు వచ్చే ముందు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి రాహుల్ మాట్లాడారా. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ లేదు” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News