Homeకరీంనగర్VLT Cancellation | గడి బురుజు భూమిపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు చేయాలి

VLT Cancellation | గడి బురుజు భూమిపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు చేయాలి

  • కోరుట్ల మున్సిపల్ చైర్మన్ & కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన గడి బురుజు భూమిపై మున్సిపాలిటీ విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT)ను తక్షణమే రద్దు(VLT Cancellation) చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత కి, మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర కి వినతిపత్రం అందజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ గారు మాట్లాడుతూ.. గడి బురుజు భూమి పట్టణానికి సంబంధించిన విలువైన ప్రజా ఆస్తి అని, చారిత్రకంగా మరియు ప్రజాపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. అటువంటి భూమిపై వీఎల్టీ విధించడం వల్ల ప్రజల్లో ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

గడి బురుజు భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించాల్సిన అవసరం ఉందని, ఆ భూమిపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు(VLT Cancellation) చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. ప్రజా ఆస్తులను కాపాడటంతో పాటు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News