Homeభక్తిBugga Malleswara Temple | శివయ్య సరసన గంగమ్మ..

Bugga Malleswara Temple | శివయ్య సరసన గంగమ్మ..

  • అద్భుతమైన హరిహర క్షేత్రం..
  • గుంటూరు జిల్లాలో కొలువైన అద్భుత దేవాలయం..

గరళకంఠుని శిరస్సున గంగమ్మ ఉండడం లోకవిదితమే! కానీ ఈ క్షేత్రంలో మాత్రం శివయ్య సరసన గంగమ్మ కొలువై ఉండడం విశేషం! అంతేనా! ఈ క్షేత్రంలో భ్రమరాంబతో కలిసి కొలువైన శివాలయం ఓ వైపు ఉంటే, మరోవైపు సీతారాములు కూడా కొలువైన ఈ అద్భుత క్షేత్రం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది.

భ్రమరాంబ సమేతంగా అడవిలో కొలువయ్యాడు బుగ్గ మల్లేశ్వరుడు.(Bugga Malleswara Temple) ఆయనకు ఆ పేరు రావడం వెనుక గొప్ప కారణమే ఉంది. ఆలయం చుట్టుపక్కల పేరుకుపోయిన రాళ్ల గుట్టలు, ఎక్కడా లభించని చుక్కనీరు! తన అభిషేకానికి భక్తులు నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారో అని తన పక్కనే ఓ నీటిబుగ్గను ఏర్పాటు చేసుకుని, ఆ నీళ్లతోనే అభిషేకాలు అందుకునే ఈ బుగ్గ మల్లేశ్వరుడు కొలువైన క్షేత్రం గుంటూరు జిల్లా మాచవరం మండల సరిహద్దుల్లోని మోర్జంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది. ఈ క్షేత్రంలో శివయ్య గంగాధరుడిగా వెలసి పూజలందుకుంటున్నాడు. బుగ్గ మల్లేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ హరిహర క్షేత్రం..

- Advertisement -

దట్టమైన నల్లమల అభయారణ్యం మొదలయ్యే ప్రాంతంలో, సరిహద్దు నల్గొండ జిల్లా పల్లెలు కనిపించే ప్రశాంతమైన వాతావరణంలో వెలసి ఉంది బుగ్గ మల్లేశ్వరాలయం. గర్భాలయంలో కొలువైన శివలింగానికి ప్రక్కనే ఒక చిన్న నీటి బిందె మాత్రమే పట్టే పరిమాణంలో ఒక నీటి బుగ్గ కనిపిస్తుంది,(Bugga Malleswara Temple) ఇందులో లభించే నీటితోనే శివయ్య నిత్యం అభిషేకాలు జరిపించుకుంటున్నాడు. చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా చుక్క నీరు కూడా కనిపించదు.

ఈ క్షేత్రంలో శివుడు మల్లేశ్వరుడుగా భ్రమరాంబతో కలిసి కొలువై ఉన్నాడు. అంతేకాదు సీతారాములు కూడా వెలసి ఉన్న ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. చుట్టూ ఎత్తుగా ఉండే రాళ్ల గుట్టల మధ్య కొండపై వెలసి దర్శనమిచ్చే ఈ ఆలయంలో శివలింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారో ఆధారాలు లేనప్పటికీ, దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని తెలుస్తోంది. అలాగే గర్భగుడిలో బుగ్గ మల్లేశ్వరుని పక్కనే భద్రకాళి, వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News