Homeరంగారెడ్డిKeesara SI Srinivas | కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన!

Keesara SI Srinivas | కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన!

  • రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ శ్రీనివాస్
  • ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు.. మారని అవినీతి తీరు!

కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీస్ శాఖలోనే లంచం ఆరోపణలు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ(Keesara SI Srinivas) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఒక కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగారం శిల్పానగర్‌లో లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి ఆరోపణలు, లంచం కేసులు చర్చకు వచ్చిన నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో కలకలం సృష్టిస్తోంది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో పోలీస్ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పిస్తూ, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే లంచం ఆరోపణల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి అవినీతి వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News