Homeభక్తిSignificance of Diwali | ఐదు రోజుల దీపావళి గురించి తెలుసుకుందాం

Significance of Diwali | ఐదు రోజుల దీపావళి గురించి తెలుసుకుందాం

  • ఈరోజు నుండి దీపావళీ ఐదు రోజుల పండుగ అంటారు వాటి విశేషాలు

ధన్వంతరీ త్రయోదశి వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆరోజు బంగారం కొనాలనే ఆశపడుతున్నాం, కానీ ఆరోజు ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరీ భగవాన్ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి, నరక యాతనలనుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృ దేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి.

నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యో తీషపురం నేటి అస్సామును పాలించే నరకుడు’నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేకఅధ్భు తశక్తులను సంపాదించి దేవత లను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య, పౌర్ణమికి న వ యవ్వన రాచ కన్యలను దేవికిబలిఇచ్చేవాడు, కాము కత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలురాచకన్యలు బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి భూదేవి కి కలిగిన సంతానమే ఈనరకు డుతామస ప్రవృత్తితో జనిం చాడు.

- Advertisement -

శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవీ అవతారం తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి సత్యభామ సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది నరక చతుర్దశి దీపావళీ(Significance of Diwali) రావణ సం హారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధ లనుం డి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం లక్ష్మీ స్వరూపం ఐశ్వర్య స్వరూరం జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజులక్ష్మీ పూజలుచేస్తాము. వ్యాపారస్తులుకొత్తలెక్కలువ్రాసుకుంటారు. బలిపాఢ్యమివామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల ను దానమడిగాడు.

వామ న వటువుకు దానమిచ్చాడు బలి, ఇంతింతై వటు డింతైనభోరాశిపైనల్లంతైఅన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన ‘త్రివిక్రముడు’ వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలిభూలోకా నికి వచ్చి ఇక్కడి దీపకాంతు లను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకువామనుడిచ్చినవరం. యమద్వితీయసూర్య భగవానునికి యముడు శనిదే వుడుఇద్దరుపుత్రులు. యము నఅనేఒకపుత్రికకలదు. యము డు – యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా తనపనిజీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధిం చే పనిలో పడి పాపం చెల్లెలిం టికి వెళ్ళటం లేదు యముడు.

చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది చెల్లెలు కార్తీకశుద్ధవిదియ ,మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు..

ఈసంత్సరం చతుర్ధశి ఉదయం 11 గంటల వరకు ఉండి అదే రోజు అమావాస్య వస్తుంది. ప్రదోష కాలం 5.30 నిమిషాలకు లక్షిమి పూజలు చేసు కోవాలి.ఉదయం 8 లోపుహారతు లు తీసుకోవాలి,సోమవారం కేదారీశ్వరి నోముల కు శుభం,కొత్త అల్లుళ్లకు పనికి రాదు(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News