Homeఆదిలాబాద్Collector Bhavesh Mishra | కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి

Collector Bhavesh Mishra | కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి

  • మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

లక్ష్మణచందా మండలం కంజర్ గ్రామ భూముల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కార విషయంపై లక్ష్మణచందా తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య, సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి వివరాలు క్లుప్తంగా నమోదు చేయాలన్నారు. దరఖాస్తుల వివరాలన్నీ పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు.

- Advertisement -

మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి:

మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి వచ్చే దరఖాస్తులన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. అవసరమైతే దరఖాస్తులను పై స్థాయికి పంపాలని తెలిపారు. మండలంలో భూముల రీ సర్వే ప్రక్రియను సమీక్షించారు. భూముల రీ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

Kanjar Village Land Issues Resolution 1

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకట మాధవ రావు, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, ఎంపిడివో వనజ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News